ఆచార్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎయిడ్స్‌డే అవగాహన ర్యాలీ

by Disha Web Desk 22 |
ఆచార్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎయిడ్స్‌డే అవగాహన ర్యాలీ
X

దిశ, జహీరాబాద్: ఆచార్య డిగ్రీ కళాశాలలో హెచ్ఐవీ ఎయిడ్స్‌ డే‌ ను పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆచార్య డిగ్రీ కాలేజీలోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1,2,3,4,5 ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కళాశాల డైరెక్టర్ జి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.... ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలించలేనిదని, నివారణ ఒక్కటే మార్గమన్నారు. ఎందుకోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎయిడ్స్ జబ్బు 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.90 కోట్ల మంది ఎయిడ్స్‌తో బాధపడుతున్నారన్నారు. వీరిలో 15 లక్షల మంది 15 సంవత్సరాలలోపు వారే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5 లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నారని అంచనా వేసారన్నారు. కావున ఈ హెచ్ఐవీ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.

హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వారు గర్భం దాల్చితే పుట్టబోవు శిశువుకి కూడా సోకే అవకాశం ఉంది. కావున సోకిన వారితో జాగ్రత్తగా ఉంటూ మనం ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు. హెచ్ఐవీ సోకిన తర్వాత సోకిన వారితో దూరంగా ఉండకుండా వారితో స్నేహబంధంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటిస్తూ వారిని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, తగిన ఔషధాలను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ , అధ్యాపకులు, వాలెంటర్లు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు కె.నందు గౌడ్, బి. విజయలక్ష్మి, అధ్యాపకులు నర్సింహులు, నికిత, దత్తు, లావణ్య, రమేష్ ,నవీన,ఇర్షద్, విద్యార్థులు పాల్గొన్నారు.Next Story

Most Viewed