భార్యను హత్య చేసి.. ఉరేసుకుని భర్త అత్మహత్య

by Disha Web Desk 1 |
భార్యను హత్య చేసి.. ఉరేసుకుని భర్త అత్మహత్య
X

అందోల్ మండలం నాదులాపూర్ లో దారుణం

దిశ, అందోల్: భార్యపై అనుమానంతో ఆమెను గొడ్డలితో నరికి.. భర్త అత్మహత్యకు పాల్పడిన ఘటన అందోల్ మండలం నాదులాపూర్ లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాదులాపూర్‌ల గ్రామానికి చెందిన ముద్దాయిపేట నారాయణ (55), భార్య మల్లమ్మ (50) భార్యభర్తలు. మల్లమ్మపై అనుమానంతో తరుచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ విషయంలో గ్రామ పెద్దలు కూడా వారిద్దరికీ నచ్చజేప్పిన ఘటనలు కూడా ఉన్నాయి. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు.

కూతురు వివాహం కాగా, కొడుకు నర్సింహులు బతుకు దేరువు కోసం హైదరాబాద్‌కు నివసిస్తున్నాడు. వారిద్దరు కూడా కొడుకు వద్దే ఉంటున్నారు. ఆదివారం టేక్మాల్‌ మండలం అచ్చన్నపల్లి గ్రామంలో వివాహ వేడుకలకు నారాయణ, మల్లమ్మ హాజరయ్యారు. అక్కడ మల్లమ్మ సోదరికి సంబంధించిన వారు కొత్త బట్టలు పెట్టి ఒడి బియ్యం పోశారు. బియ్యం పోసిన రోజు సొంతింటికి వెళ్లాలన్న పద్ధతులు ఉండడంతో తన భార్యను తీసుకొని స్వగ్రామమైన నాదులాపూర్‌ గ్రామానికి ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. గ

త కొంతకాలంగా చాకలి అంబమ్మకు భార్య, భర్తలు ఇద్దరూ తమ ఇంటిని అప్పగించి గచ్చిబౌలి ప్రాంతంలో తన కుమారుడు నర్సింహులు వద్దనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఒడి బియ్యం, కొత్త బట్టలతో వచ్చాం.. నిద్రచేసి రేపు వెళ్లిపోతాం అంటూ.. ఇంట్లో ఉన్న అంబమ్మను ఎవరింట్లో అన్న పడుకొమ్మంటూ దంపతులు ఆమెను బయటకు పంపారు. దీంతో అంబమ్మ రాత్రి తన బంధువుల ఇంట్లో పండకుంది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే నిద్రిస్తున్న మల్లమ్మపై భర్త నారాయణ ఆమె తల, మెడభాగాలపై గొడ్డలితో బలంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మల్లమ్మ చీరతోనే నారాయణ ఇంట్లో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు.

సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో అంబమ్మ నారాయణ ఇంటికి వెళ్లి తలుపులు తట్టగా ఎలాంటి సమాధనం లేదు. దీంతో అంబమ్మ తలుపు సందులోంచి లోపలికి చూడగా రేకుల షెడ్‌కు నారాయణ మృతదేహం వేలాడుతూ కనబడింది. దీంతో అంబమ్మ భయంతో పరుగులు తీస్తూ ఇరుగు, పొరుగు వారికి విషయాన్ని తెలిపింది. స్థానికులు తలుపులు తెరచి చూడగా భార్య, భర్తలు ఇద్దరు వేరువేరు గదుల్లో విగత జీవులై పడి ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. జోగిపేట సీఐ నాగరాజు, ఎస్‌ఐ సామ్యానాయక్‌లు పంచనామా నిర్వహించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గచ్చిబౌలికే రమ్మన్నా: కుమారుడు నర్సింహులు

చాలాకాలంగా మా అమ్మను అనుమానిస్తూ కొడుతూ ఉండటంతో తన వద్దే ఉంటే గొడవలు జరగవని భావించి తల్లిదండ్రులను గచ్చిబౌలిలో తన వద్దే ఉంచుకున్నట్లు కొడుకు నర్సింహులు తెలిపాడు. ఆదివారం టేక్మాల్‌లో జరిగిన వివాహం వద్ద గొడవ జరిగినట్లు అమ్మ మల్లమ్మ ఫోన్‌ చేసిందని తెలిపాడు. వెంటనే గచ్చిబౌలికి వచ్చేయమని చెప్పానని, అయినా.. వినకుండా ఊరికే వెళ్లారంటూ రోదిస్తూ నర్సింహులు తన ఆవేదనను వెల్లగక్కాడు. నర్సింహులు చెల్లెలికి వివాహం కాగా, భార్య మల్లమ్మను చంపేసి, నారాయణ అత్మహత్యకు పాల్పడడంతో ఇక నర్సింహులు నర్సింలు ఒంటరివాడయ్యాడు.

మద్యం మత్తులోనే హత్య?

గ్రామంలో విచ్చలవిడిగా దొరకడం వల్లే నారాయణ మద్యం మత్తులో మల్లమ్మను హత్య చేశాడని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. వీరిద్దరి మధ్య గతంలో ఎన్నోసార్లు గొడవలు జరిగాయని, కానీ ఇలాంటి దారుణాలు ఎప్పడూ జరుగలేదన్నారు. గ్రామంలో బెల్టు షాపులను అరికట్టాలంటూ సీఐ నాగరాజు, ఎస్‌ఐ సామ్యానాయక్‌ల దృష్టికి మహిళలు తీసుకెళ్లారు. పంచాయతీ తీర్మాణం చేసి ఆ పత్రాన్ని తమకు అందజేయాలని సీఐ సూచించగా, సర్పంచ్‌ సత్యానారయణ రెండు రోజుల్లో అందజేస్తామని తెలిపారు. మద్యం అమ్మకాలపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకొవాలంటూ మాజీ ఎంపీటీసీ బాలమణి సీఐ నాగరాజు, ఎస్‌ఐ సామ్యానాయక్‌ల దృష్టికి తీసుకొచ్చారు.


Next Story

Most Viewed