మోడల్ స్కూల్లో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభం

by Kalyani |
మోడల్ స్కూల్లో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభం
X

దిశ, పెద్ద శంకరంపేట్: పెద్ద శంకరంపేట మండలం తిరుమలాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్ అడ్మిషన్ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సిహెచ్ శ్రీలత తెలిపారు. తరగతులు వారీగా 6వ తరగతి ప్రవేశానికి 100 సీట్లు.. 7వ తరగతి ఏడు సీట్లకు ఓసి జనరల్ 4, బీసీ బాలిక 1, బి సి బి జనరల్ 2...8 వ తరగతి 3 సీట్లకు ఓసి జనరల్ 2, బీసీ ఏ జనరల్ 1..9వ తరగతి 3 సీట్లకు ఓసి జనరల్ 2, ఎస్సీ జనరల్ 1.. పదవ తరగతి 2 సీట్లకు ఎస్టీ జనరల్ ఒకటి, ఓసీ జనరల్ ఒకటి ఖాళీల ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫామ్, భోజన సదుపాయం కల్పిస్తామని ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత పత్రాలతో అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శ్రీలత తెలిపారు.

Next Story