మద్యం పంపిణీ పై చర్యలు తీసుకొవాలి

by Disha Web Desk 22 |
మద్యం పంపిణీ పై చర్యలు తీసుకొవాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట నియోజకవర్గంలో మద్యం పంపిణీ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రిటర్నింగ్ ఆఫీసర్ రమేష్ బాబుకు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ...నియోజక వర్గ పరిధిలోని పలు మండలాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టిందుకు బీఆర్ఎస్ నాయకులు విచ్చవిడిగా మద్యం పంచుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం పంపిణీ పై అధికారులు చర్యలు తీసుకొని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వహాబ్, ఖయాజుద్దీన్, నవాజ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Next Story