తెలంగాణ తల్లి ముసుగును కాల్చిన నిందితుడు అరెస్ట్

by Kavitha |
తెలంగాణ తల్లి ముసుగును కాల్చిన నిందితుడు అరెస్ట్
X

దిశ, హుస్నాబాద్ ; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహం ముసుగును కాల్చిన నిందితున్ని అరెస్టు చేసినట్లు హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం రాత్రి చౌటపల్లి గ్రామంలోని బురుజు వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పైన ఉన్న ముసుగును కాల్చారని బీఆర్ఎస్ నాయకులు అక్కన్న పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని ఎస్సై విజయభాస్కర్ నిందితున్ని పట్టుకోవడం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం మంగళవారం అధునాతన టెక్నాలజీ ఉపయోగించి అదే గ్రామానికి చెందిన కామాద్రి రాంబాబు(34)గా గుర్తించి పట్టుకున్నారని సీఐ వెల్లడించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed