అడవికి ప్రమాదవశాత్తు నిప్పు..

by Kalyani |
అడవికి ప్రమాదవశాత్తు నిప్పు..
X

దిశ, ఝరాసంగం: ప్రమాదవశాత్తు అడవికి నిప్పంటుకొని చెట్లు, ఆకులు పూర్తిగా కాలి బూడిదైన ఘటన ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని దట్టంగా మంటలు వ్యాపించాయి. బర్దిపూర్ గ్రామానికి చెందిన బత్తిన పాండు అనే యువకుడు అటువైపుగా వెళ్తున్న క్రమంలో మంటలను గమనించి జహీరాబాద్ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గ్రామస్తుల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో పలు నీలగిరి చెట్లు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బందికి సమయం లో సమాచారం అందించిన యువకులను ఫైర్ సిబ్బంది అభినందించారు.



Next Story

Most Viewed