- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
అగ్ని గుండాల కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు

దిశ, కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు ఆదివారం అర్థరాత్రి అగ్ని గుండాల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీసీ అడ్మిన్ ఎస్.మహేందర్, ట్రాఫిక్ ఏసీపీ ఫణిధర్ తో కలసి తోటబావి, ఆ పరిసర ప్రాంతాల్లో వీఐపీ, జనరల్ పార్కింగ్, దర్శన ప్రదేశాలను వారు పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ మాట్లాడుతూ కొమరవెల్లి మల్లికార్జున స్వామి చివరి ఆదివారం అగ్ని గుండాల సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించామని తెలిపారు. అదేవిధంగా పోలీస్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి, ప్రతి డిపార్ట మెంట్ వారు అందుబాటులో ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
దర్శనాలను వీఐపీ, శీఘ్ర, సాధారణ దర్శనాలుగా విభజించామని తెలిపారు. కల్యాణ వేదిక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పార్కింగ్ ప్రదేశాల్లో మరియు టెంపుల్ ఆవరణలో మొత్తం 80 సీసీ కెమెరాలతో, అదేవిధంగా 300 మంది సిబ్బందితో పటిష్టమైన భద్రతకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేర్యాల సీఐ సత్యనారాయణ రెడ్డి, కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.