మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన

by Disha Web Desk 1 |
మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన
X

దిశ, కొల్చారం : సంస్కృత, సాహిత్య రంగంలో జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన మల్లినాథ సూరి మెదక్ జిల్లాకు చెందిన వారు కావడం జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. ఆయన స్వస్థలం కొల్చారంలో కోలాచల మల్లినాథసూరి పేర సంస్కృత విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రమేష్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, మహారాష్ట్రలోని రామ్ టెక్ సంస్కృత విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ మధుసూదన్, ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం, కాలేజీ ఎడ్యుకేషన్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డా.యాదగిరిలతో కలిసి విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం కొల్చారం శివారులో అధికారులు గుర్తించిన 30 ఎకరాల స్థలాన్ని ప్రాంతాన్ని, మరోచోట గుర్తించిన 27 ఎకరాల స్థలాలను వారు పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాహిత్య రంగంలో మెదక్ జిల్లాకు వన్నె తెచ్చిన మల్లినాథసూరి స్వస్థలమైన కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయ ఏర్పాటు చేయుటకు కార్యాచరణ చేపట్టవలసినదిగా సీఎం విద్యాశాఖను ఆదేశించారని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి సూచనల మేరకు కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయ ఏర్పాటుకు రెండు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించామని, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నర్సాపూర్ ఎమ్మెల్యేకు కూడా స్థలాలపై పూర్తి సమాచారమిచ్చారని తెలిపారు. ఆ స్థలాలు రోడ్డుకు సమీపంలో ఉండడం, బోరు పడే అవకాశాలున్నాయని గుర్తించామన్నారు.

మౌలిక సౌకర్యాలతో సాంస్కృత విశ్వవిద్యాలయ ఏర్పాటుకు స్థలం ఎంపికలో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని లింబాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ చంద్రశేఖర్, ఏం.పీ.డీ.వో గణేష్ రెడ్డి, జడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, కొల్చారం సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీ శంకర్, యువజన విభాగం మండలాధ్యక్షుడు సంతోష్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రవితేజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed