అమరుల త్యాగ ఫలితమే ప్రత్యేక రాష్ట్రం : ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Disha Web Desk 1 |
అమరుల త్యాగ ఫలితమే ప్రత్యేక రాష్ట్రం : ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

మెరుగైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం

దిశ, దుబ్బాక : 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అమరులైన విద్యార్థి యువకుల త్యాగ ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, సిద్ధించిన తెలంగాణలో కొన్ని వర్గాలకే ప్రయోజనాలు నెరవేరాయని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, 100 పడకల ఆసుపత్రి వద్ద, జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని తెలిపారు. వారందరి బలిదానాల ఫలితమే 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఏర్పటైందని గుర్తు చేశారు.

ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రంలో కొన్ని వర్గాలకే ప్రయోజనాలు నెరవేరాయని ప్రజలు అంటున్నారన్నారు. 85 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గిరిజనులకు న్యాయం జరగపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఇది రాజకీయ విమర్శలు కాదని సూచనలు మాత్రమేనని అన్నారు. మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉండాలని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే భిన్నంగా ఉంటుందనుకుంటే ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సి ఉండే అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంన్నారు.

అనంతరం ఆయన దుబ్బాక పట్టణంలో గాందీ విగ్రహాం వద్ద, చేనేత కార్మిక సంఘం వద్ద, తహసీల్దారు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి కిష్టమ్మ గారి సుభాష్ రెడ్డి, భీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకోజి ప్రవీణ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్‌ ఎస్.ఎన్. చారి, స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ దూలం వెంకట్ గౌడ్, యువ మోర్చా అసెంబ్లీ కన్వీనర్‌ మాధవనేని భాను ప్రసాద్, పుట్ట వంశీ, మచ్చ శ్రీనివాస్, తోగుట రవి, ఆకుల నరేష్, మరాఠి బాబు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed