రసవత్తరంగా సాగిన అవిశ్వాస సమావేశం

by Disha Web Desk 22 |
రసవత్తరంగా సాగిన అవిశ్వాస సమావేశం
X

దిశ, మద్దూరు: మద్దూరు మండలంలోని రేబర్తి పీఎసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డిలపై పెట్టిన అవిశ్వాస సమావేశం, జిల్లా సహకార అధికారిని కరుణ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. పీఎసీఎస్ సొసైటీ డైరెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మ్యాక మల్లేశం, ఉత్కూరి మల్లేశం, జగన్, శ్రీనివాస్, దేవదాసు, అంజయ్య, శోభ, 8 మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరుఅయ్యారు. అధికారిని కరుణ సమావేశానికి అరగంట ఆలస్యంగా వచ్చి సమావేశాన్ని ప్రారంభించారు. మాకు తప్పుడు సమాచారం ఇచ్చారని, పీఎసీఎస్ రేబర్తి సెంటర్‌లో సమావేశం జరుగుతుందని ప్రొసీడింగ్ లో తెలిపారని, ఇప్పుడు క్యాష్ కౌంటర్ మద్దూరులో సమావేశం ఏర్పాటు చేయడంపై డైరెక్టర్లు అధికారులపై వాగ్వాదానికి దిగారు. రేబర్తి సెంటర్ లోనే సమావేశం ఏర్పాటు చేయాలని డైరెక్టర్లు పట్టు పట్టడంతో, జిల్లా అధికారిని సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారిని మాట్లాడుతూ.. సమావేశానికి నేను ఆలస్యంగా వచ్చినందుకు సమావేశాన్ని రేపటికి వాయిదా వేస్తున్నానని, బుధవారం రేబర్తి పీఎసీఎస్ సెంటర్లో సమావేశం జరుగుతుందని తెలిపారు.


Next Story

Most Viewed