దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సమగ్ర సర్వే.. ఎమ్మెల్యే సంజీవరెడ్డి..

by Sumithra |
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సమగ్ర సర్వే.. ఎమ్మెల్యే సంజీవరెడ్డి..
X

దిశ, పెద్దశంకరంపేట : భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం చేపట్టిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం పెద్ద శంకరంపేటలోని చౌదరి చెరువులో 38 వేల చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. సమగ్ర సర్వే వల్ల బీసీలకు అభివృద్ధి కోసం నిధులు ఎక్కువగా కేటాయించడంతో పాటు రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని విమర్శించారు.

మచ్చ కారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని. పెద్ద శంకరంపేటలో మత్సకారులకు గృహాలను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అప్పుల పాలు చేయడమే కాకుండా అభివృద్ధి మరిచి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్. మెదక్ జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మునివేళ్ళ రామన్న, జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయిని మధు, నారా గౌడ్ ఆర్యన్ సంతోష్ కుమార్, విగ్రాం.రాజన్ గౌడ్, దాచ సంగమేశ్వర్, పెరుమాండ్లు, గౌడ్.పున్నయ్య, మల్గొండ చంద్రశేఖర్, పోచయ్య, జోడు రవి, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story