ఫిబ్రవరి ఫస్ట్ ​వీక్‌లో పోడు పట్టాలు ఇస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

by Disha Web Desk 19 |
ఫిబ్రవరి ఫస్ట్ ​వీక్‌లో పోడు పట్టాలు ఇస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫిబ్రవరి ఫస్ట్​వీక్‌లో పోడు పట్టాలు ఇవ్వనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్​పేర్కొన్నారు. ఇప్పటికే వందశాతం సర్వేను గ్రామ సభల ద్వారా పూర్తి చేశామని అన్నారు. పోడు భూముల దరఖాస్తులను ఫారెస్ట్ రైట్స్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల ద్వారా పరిశీలించి లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ గత సంవత్సరం నుండి కొనసాగుతుందని అన్నారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్ నుండి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో కలసి ఆమె వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పోడు భూములకు పట్టాలివ్వడంతో పాటుగా అడవుల సంరక్షణకు ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత నిస్తుందని స్పష్టం చేశారు. పోడు భూములకు అధికంగా దరఖాస్తులు అందిన జిల్లాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, అన్ని స్థాయిల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసుకొని పట్ట పాస్ బుక్‌లను ప్రింట్ చేసి, ఫిబ్రవరి మొదటి వారానికల్లా సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పీసీసీఎఫ్ డోబ్రియాల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు తదితర అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed