మల్లారెడ్డి ఐటీ రెయిడ్స్ వ్యవహారంలో వీడని ల్యాప్ టాప్ సస్పెన్స్

by Dishanational2 |
మల్లారెడ్డి ఐటీ రెయిడ్స్ వ్యవహారంలో వీడని ల్యాప్ టాప్ సస్పెన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ రెయిడ్స్ వ్యవహారంలో ల్యాప్ టాప్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వారం రోజులు గడుస్తున్నా ల్యాప్ టాప్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉంది. మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితులపై గత నెలలో ఐటీ సోదాలు జరిగాయి. ఈ సందర్భంలో తమ అధికారికి చెందిన ల్యాప్ టాప్ ను మల్లారెడ్డి అనుచరులు తీసుకువెళ్లారని ఐటీ ఆరోపించింది. అంతేకాదు విలువైన పత్రాలను చించివేశారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తమ మెడికల్ కాలేజీల్లో డొనేషన్ల ద్వారా రూ.100 కోట్లు తీసుకున్నట్టుగా స్టేట్ మెంట్ తయారు చేసి తన కొడుకుతో ఐటీ అధికారులు సంతకం చేయించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు.

ఈ విషయమైన మల్లారెడ్డి ఐటీ అధికారిని బోయినపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ సమయంలో స్టేషన్ వద్ద గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత ఇరు వర్గాల ఫిర్యాదులను పోలీసులు స్వీకరిచగా ఆ ల్యాప్ టాప్ మాత్రం పోలీస్ స్టేషన్ లోనే ఉండిపోయింది. ఆ ల్యాప్‌టాప్ ఐటీ అధికారులదేనంటున్న మల్లారెడ్డి అనుచరులు ఆరోపిస్తుండగా అక్కడ ఉన్నది తన ల్యాప్ టాప్ కాదని తన ల్యాప్ టాప్ తనకు ఇప్పించాలని రత్నాకర్ అనే ఐటీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రస్తుతం బోయిన పల్లి స్టేషన్ లో ఉన్న ల్యాప్ టాప్ ఎవరిది అనేదానిపై సస్పెన్స్ వీడటం లేదు. ఐటీ అధికారులు ఆరోపిస్తున్నట్టుగా స్టేషన్ లో ఉన్న ల్యాప్ టాప్ నకిలీది అయితే అసలు ల్యాప్ టాప్ ఎక్కడా? స్టేషన్ లో ఉన్న ల్యాప్ టాప్ ఎవరిది అనేద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేథ్యంలో అసలుకు ఈ ల్యాప్‌టాప్ ఎవరిదనే విషయాన్ని తేల్చేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed