- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మా మనవరాలు పెళ్లికి రండి! బండి సంజయ్‌తో మల్లారెడ్డి భేటీ
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు బీఆర్ఎస్ నేతలు బీజేపీ, కాంగ్రెస్ నాయకులను కలిశారు. కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి, బీజేపీ నేత బండిసంజయ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా మల్లారెడ్డి తాజాగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అయితే విషయం ఏమిటంటే.. తన మనవరాలు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు మర్రి శ్రేయారెడ్డి ఆదిత్యల వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
అదేవిధంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సైతం కలిసి పెండ్లి పత్రికను అందించి ఆహ్వానించారు. కాగా, ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుని కూడా తన మనవరాలి వివాహ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించారు.
Advertisement
Next Story