సర్వం కోల్పోయాం.. మాకు దిక్కెవరు..? మల్లన సాగర్​ బాధితుల ఆవేదన

by Disha Web |
సర్వం కోల్పోయాం.. మాకు దిక్కెవరు..? మల్లన సాగర్​ బాధితుల ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో: మల్లన్నసాగర్​ముంపు గ్రామాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు లాక్కొని రోడ్డున పడేశారని ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలను మీరైన పట్టించుకోండి అంటూ మంత్రి హరీష్​రావుకు ఎర్రవెల్లి గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఎర్రవెల్లి గ్రామ ప్రజలు మంత్రికి సమస్యలు వివరించారు. మల్లన్న సాగర్‌లో సర్వస్వం కోల్పోయామన్నారు.

మల్లన్న సాగర్ నిర్మాణం కోసం మొదటి నుంచి సహకరించామని, కానీ ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యం వైఖరి చూపడం సబబు కాదని తెలిపారు. వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. గ్రామస్తుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు.. వెంటనే జిల్లా కలెక్టర్‌కు, అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసి చేశారు. ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందవద్దని, త్వరలోనే అందరికీ పట్టాలు అందించేందుకు కృసి చేస్తామని మంత్రి మల్లన్న సాగర్​ముంపు బాధితులకు తెలిపారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed