- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరకాటంలో మహేందర్ రెడ్డి.. తమ్ముడి విషయంలో ఎటూ తేల్చుకోలేని వైనం
దిశ, తెలంగాణ బ్యూరో: లగచర్ల ఘటనలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు. ఈ వివాదంలో ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. అటు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి సంఘీభావం తెలపలేక, ఇటు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించలేక మౌనంగా ఉన్నారు. సొంత జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించాలని మీడియా ఆయన్ను అడిగితే ‘నేను ఏం మాట్లాడను. నన్ను ఏం అడగొద్దు’ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మౌనంగానే..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నా మహేందర్ రెడ్డి గొంతు విప్పి, తన వైఖరిని నిర్మోహమాటంగా చెప్పేవారు. కానీ లగచర్ల ఘటనలో మాత్రం మౌనంగా ఉండిపోవాల్సి వస్తున్నదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ ఘటనను తప్పుపడితే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వైఖరిని తప్పుపట్టినట్టు అవుతుంది. అలాగని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేని పరిస్థితిలో ఆయన ఉన్నట్టు మహేందర్ రెడ్డి అనుచరుల మధ్య డిస్కషన్ జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహేందర్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆయన భార్య పట్నం సునీతకు (రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్) మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ ఇచ్చింది. అప్పటి నుంచి మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. తమ్ముడు నరేందర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. కానీ తమ్ముడి అరెస్టును ఖండించడమో, లేకపోతే అధికారులపై జరిగిన దాడిని వ్యతిరేకించడమో చేయకుండా మహేందర్ రెడ్డి మౌనంగా ఉండిపోయారు. ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భావనతో ఆయన తన నోటికి తాళం వేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
తమ్ముడికి రాజకీయ గురువు
నరేందర్ రెడ్డిని రాజకీయాల్లోకి ఎంట్రీ చేసిందే మహేందర్ రెడ్డి. 2018 ఎన్నికల్లో కొడంగల్ సెగ్మెంట్లో రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నుంచి నరేందర్ రెడ్డిని బరిలోకి దింపి ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ 2023 ఎన్నికల్లో మళ్లీ తమ్ముడి గెలుపు కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచి సీఎం పగ్గాలు చేపట్టారు. కానీ పార్లమెంట్ ఎన్నికల నాటికి జిల్లాలో మారిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. కానీ ఆయనకు సీఎం రేవంత్ మండలి చీఫ్ విప్ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.