మహిళా ఆర్థిక స్వావలంబన కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : వనపర్తి ఎమ్మెల్యే

by Aamani |
మహిళా ఆర్థిక స్వావలంబన కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం :  వనపర్తి ఎమ్మెల్యే
X

దిశ,వనపర్తి : మహిళా ఆర్థిక స్వావలాంబననే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి అన్నారు.శనివారం ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తో కలిసి వనపర్తి మండలం,నాచహల్లి గ్రామంలో నూతన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.వనపర్తి మండలం కందిరీగ తండాలో జిల్లా స్థాయి అంగన్వాడి మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో విద్యార్థులకు, దుస్తువులు పాఠ్యపుస్తకాలను,టేబుల్ లను అందజేశారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం ప్రభుత్వం ముందుకెళ్తుదన్నారు.వ్యక్తి గత అభివృద్ధి తోపాటుగా గ్రామ అభివృద్ధి లో భాగస్తులవ్వాలాన్నారు.అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సిడిపిఓ హజీరా,మాజీ ఎంపీపీ కిచ్చా రెడ్డి, మాజీ జడ్పీటీసీ గొల్ల వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ నాగరాజు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed