ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

by Kalyani |
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం
X

దిశ,పెద్ద కొత్తపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకొని స్వగ్రామానికి ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణంలో అదే బస్ లో ఓ గర్భిణీ మంగళవారం సాయంత్రం మార్గమధ్యంలో ప్రసవం అయింది. ఇందుకు సంబంధించి గర్భవతి సువర్ణ కు సహాయకురాలిగా వచ్చిన ఆశా కార్యకర్త మల్లికాంత కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన సువర్ణ తమ గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త మల్లికాంత తో మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్ కు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకో వారం రోజులకు ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో వారు తిరిగి స్వగ్రామం ఎల్లూర్ కు వెళ్లేందుకు జిల్లా కేంద్రంలో బస్ నంబర్ టీఎస్ 07 యూజి 7492 ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కారు. డ్రైవర్ గోపాల్, కండక్టర్ రాజ్ కుమార్ విధుల్లో ఉన్నారు.

మార్గమధ్యంలో మండల పరిధిలోని ఆదిరాల సమీపంలోకి బస్ రాగానే గర్భవతి అయిన సువర్ణ కు పురిటి నొప్పులు అధికమయ్యాయి. అదే బస్సులో ఉన్న ఏఎన్ఎం రేణుక అప్రమత్తమై బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దిగమని డ్రైవర్, కండక్టర్ కు సూచించింది. ఆ వెంటనే సదరు ఏ ఎన్ ఎం రేణుక, ఆశా కార్యకర్త మల్లికాంత తో కలిసి సదరు మహిళ సువర్ణకు కాన్పు చేయగా ఆడ కుతూరుకు పురుడు పోశారు. తల్లి బిడ్డ క్షేమం గా ఉండడంతో అంబులెన్స్ లో పెద్దకొత్తపల్లి పండర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సువర్ణ కాన్పుకు బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు సహకరించినందుకు ఏఎన్ఎం రేణుక, ఆశా కార్యకర్త మల్లికాంత, కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed