ఆభరణాల కోసం మహిళపై దాడి

by Aamani |   ( Updated:2024-12-07 14:23:22.0  )
ఆభరణాల కోసం మహిళపై దాడి
X

దిశ,నవాబ్ పేట/ మహబూబ్ నగర్ ప్రతినిధి: మహిళ ధరించిన ఆభరణాలను కాజేయడానికి ఓ ఆగంతకుడు మహిళ గొంతుపై కత్తితో దాడి చేశాడు.ఈ సంఘటన శనివారం నవాబుపేట మండలం,ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతంలో జరిగింది.నగలు ధరించిన ఒక మహిళను కూచూర్ గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం అడవిలోకి తీసుకువెళ్ళి ఎవరూ లేరని గ్రహించి ఆ మహిళ గొంతుపై కత్తితో దాడి చేయగా,ఆ మహిళ కేకలు వేయగా రహదారి వెంబడి వెళుతున్న వాహనదారులు గమనించి మహిళను కాపాడి అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న నవాబుపేట పోలీసులు నిందితుడు కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.జరిగిన సంఘటనపై ఎస్ఐ విక్రమ్ ను సంప్రదించగా,సంఘటనకు సంబంధించిన ఫిర్యాదు తనకు అందలేదని,ఫిర్యాదు అందిన వెంటనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed