కొల్లాపూర్‌లో రాజకీయ కాక.. జూపల్లి రాకతో కాంగ్రెస్ లో మారిన సమీకరణలు

by Disha Web Desk 12 |
కొల్లాపూర్‌లో రాజకీయ కాక.. జూపల్లి రాకతో కాంగ్రెస్ లో మారిన సమీకరణలు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయన అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ కాక ఆరంభం అయ్యింది. అధికార బీఆర్ఎస్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య మొదటి నుంచి సాగుతూ వస్తున్న అంతర్యుద్ధం పరాకాష్టకు చేరడం.. ఆపై జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ అధిష్టానం బహిష్కరణ తో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ అలజడి ఆరంభం అయ్యింది. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు సమావేశాలు నిర్వహించడంతోపాటు రాజకీయ నిపుణులు, శ్రేయోభిలాషుల అభిప్రాయాలను సేకరించి చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో కొల్లాపూర్ రాజకీయాలలో ఒక్కసారిగా కాక మొదలైంది. అధికార బీ ఆర్ఎస్ తో పాటు, కాంగ్రెస్, ఇతర పార్టీలలోనూ అలజడులు చెలరేగుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇమేజ్ సాధించుకున్న జూపల్లి కృష్ణారావు స్థానిక సంస్థల ఎన్నికలలో తన సత్తా చాటుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్టు తనకే వస్తుందన్న ఆశతో ఉన్న జూపల్లి కృష్ణారావుకు టికెట్ దక్కదు అన్న విషయం తేలడంతో అభిమానులు, శ్రేయోభిలాషుల సలహాలు సూచనలతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం.. ఆ మేరకు పీసీసీ అధినేతలను కలవడం, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడం చకచక జరిగిపోయాయి.

ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధినేత రాహుల్ గాంధీని జూపల్లి, ఆయన అనుచర వర్గం కలవడం ఒక్కసారిగా అలజడి రేపింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ బాహుబలి చూస్తూ వస్తున్న నియోజకవర్గ టికెట్ ఆశిస్తూ వస్తున్న అభిలాష్ రావు, జగదీశ్వరరావు పార్టీ ప్రయోజనాల కోసం తమ వంతు పాత్రను నిర్వహించారు. రెండున్నర సంవత్సరాల క్రితం భారీ బహిరంగ సభను కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో చూపులు కృష్ణారావు అభిమానులు, శ్రేయోభిలాషులు సూచించినట్లుగానే కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టారు

టికెట్ నాదే అంటున్న జగదీశ్వరరావు-పార్టీ ప్రయోజనాలే ప్రధానం అంటున్న అభిలాష్ రావు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని పార్టీ అధిష్టానం గతంలోని నాకు హామీ ఇచ్చింది. పైగా అధిష్టానం నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్టు ఇస్తామని హామీ ఇచ్చారు అని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న జగదీశ్వరరావు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు మాత్రం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సూచించిన వ్యక్తి ఘన విజయం సాధించాలి. అందుకు నా వంతు కృషి చేస్తా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు లేకుండా పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందించేందుకు తగిన చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రంగంలోకి విష్ణువర్ధన్ రెడ్డి

అధికార బీఆర్ఎస్‌ను వీడి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరెందుకు రంగం సిద్ధం అవుతుంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవడం కష్టతరం అవుతుందన్న నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. దీర్ఘ కాలం పాటు ఆయా పార్టీలకు సేవలు అందించిన విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి కి టికెట్ ఇస్తే గెలుపు కష్టం అని, ముఖ్యమైన వారికి అవకాశాలు కల్పిస్తే ప్రయోజనాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌..ప‌శ్చిమలో జంగా, నాయినిల మ‌ధ్య ఆధిప‌త్య పోరు

Next Story

Most Viewed