జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

by Disha web |
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
X

దిశ, అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గ పరిధి అన్ని మండలాలలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హామీ ఇచ్చారు. శనివారం అచ్చంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందు నాయక్ అధ్యక్షతన పట్టణంలో నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు రోజుల్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ స్థలాల వివరాలు సేకరించి ఎక్కడ అవకాశముంటే అక్కడ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా త్వరితగతిన ఇండ్ల స్థలాలు ఇప్పించడానికి కృషి చేస్తానని అన్నారు.

నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందునాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్ సీనియర్ పాత్రికేయులు బ్రహ్మములను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రకాష్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు అబ్దుల్లా, జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులు, జాతీయ కార్యవర్గ సభ్యులు రహుప్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Next Story