- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
మోడీకి తెలంగాణ అంటేనే అక్కసు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ, మహబూబ్ నగర్ : దేశంలో తెలంగాణ సుభిక్షంగా, సంక్షేమ పథకాలలో నెంబర్ వన్ గా ఉండడం వల్లనే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ అంటేనే అక్కసు అని, అందుకే ప్రతిసారి తెలంగాణ ఏర్పాటు పై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జిల్లా పరిధిలోని హన్వాడ మండల పర్యటనలో భాగంగా మునిమోక్షం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు సార్లు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా పై ప్రధాని హామి ఇచ్చి కూడా, ఆ అంశాన్ని పక్కకు పెట్టామని, ఇక పై ఏ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వబోమని చెప్పి, మనకు ఎగువన ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, పాలమూరుకు మాత్రం అన్యాయం చేశారని, దీనీ పై రాష్ట్ర బీజెపీ నాయకులు నోరు మెదపలేదని ఆయన విమర్శించారు.
గతంలో దివంగత సుష్మాస్వరాజ్ సహ హోం మంత్రి అమిత్ షా కూడా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం తెలంగాణ దేశం తలెత్తుకునేలా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే సహకరించాల్సిన ప్రధాని ఇలా విధ్యేషం రగిల్చేలా మాట్లాడడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఈ గడ్డపై కాలు మోపే ముందు ప్రధానమంత్రి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా, అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ, ఎస్సీ తదితర బిల్లులకు ఆమోదం తెలపాలని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న కృష్ణా జలాల పంపిణీ వాటాను కూడా త్వరగా పూర్తి చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.