వైద్యుల సూచనలు పాటిస్తే క్షయ నయం అవుతుంది - జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి

by Kalyani |
వైద్యుల సూచనలు పాటిస్తే క్షయ నయం అవుతుంది - జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి
X

దిశ,వనపర్తి : వైద్యుల సూచనల కనుగుణంగా గా క్షయ వ్యాధి గ్రస్తులు ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవడం క్రమం తప్పకుండా మాత్రలను వేసుకోవడం ద్వారా క్షయ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారని ప్రోగ్రాం అధికారి సాయినాథ్ రెడ్డి అన్నారు.ఆయుష్ మాన్ భవ కార్యక్రమం లో భాగంగా వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రిలోని క్షయ వ్యాధి చికిత్స విభాగం లో క్షయ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నిక్షయ్ టీబీ పోషణ అభియాన్ లో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులకు కోడిగుడ్డు,కందిపప్పు,బియ్యం,మంచి నూనె,ప్రోటీన్స్ పౌడర్​ కలిగిన కిట్ లను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ క్షయ వ్యాధి గ్రస్తులు డాక్టర్ ల సూచనల మేరకు ప్రతి రోజు పౌష్టికాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా మాత్రలను వేసుకోవడం, వ్యతిగత శుభ్రత పాటించడం,పరిసరాల పరిశుభ్రత ఉండేలా చూసుకోవడం ద్వారా క్షయ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారన్నారు.ఈ కార్యక్రమంలో ఇమ్మ్యూనిజషన్ అధికారి డాక్టర్ పరిమళ,జిల్లా ఎన్ సీడీ కోఆర్డినేటర్ సాయిరెడ్డి మహేష్, టీబీ కోర్డినేటర్ జోషి, సూపర్ వైసర్ లు ప్రవీణ్, రత్నయ్య, జయప్రద,ల్యాబ్ టెక్నీషియన్ ప్రశాంతి,క్షయ వ్యాధి రోగులు రోగులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed