ఈ చెట్టుతో ..ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు

by Kalyani |
ఈ చెట్టుతో ..ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు
X

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ పట్టణ శివారులో సింగోటం క్రాస్ రోడ్డు నుంచి వనపర్తి, కోడేరు రూట్ లో వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు పైకి ఓ మహా వృక్షం పూర్తిగా ఒరిగిపోయి ఉంది. బండి వెంకట్ రెడ్డి సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రానికి ఎదురుగా ఈ మహా వృక్షం ఉంది. ఏ క్షణంలో కూలిపాడుతుందోనని వాహనచోదకులు హడలిపోతున్నారు. ఆ రూట్లులో రాకపోకలు సాగించే భారీ వాహనాలు, ద్విచక్ర వాహనదారులు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఈ మహా వృక్షం తో ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా ఆర్ అండ్ బీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు. గాలి దుమారానికి ఈచెట్టు రోడ్డుపై ఎప్పుడు కూలుతుందో నాని బాటసారులు భయపడుతున్నారు. ప్రమాదం జరుగక ముందే సంబంధిత అధికారులు స్పందించి ఆ మహా వృక్షాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed