పదవ తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

by Kavitha |
పదవ తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
X

దిశ, నాగర్ కర్నూల్: పదవ తరగతి విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం చోటు చేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన తౌఖిర్ నల్లవెల్లి రోడ్డు లోని దిప్రిజం ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. సోమవారం తరగతి గదిలో పవన్ అనే ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తుండగా సదరు విద్యార్థి నవ్వడంతో తన చేతిలో ఉన్న కర్ర తో విచక్షణ రహితంగా కర్ర విరిగేదాకా దాడి చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. సదరు ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed