నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానికి రంగం సిద్ధం

by Aamani |
నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్‌పై  అవిశ్వాస తీర్మానికి రంగం సిద్ధం
X

దిశ,నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పై అధికార కాంగ్రెస్ పార్టీ కన్ను పడింది. అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రెడీ అవుతున్నారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ కల్పనా భాస్కర్ గౌడ్ ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి పలువురు కౌన్సిలర్ చేరారు. దీంతో చైర్మన్ ను మార్చేందుకు 13 మంది ఫోరం సభ్యులు కావాల్సి ఉండగా కాంగ్రెస్ పార్టీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ కి చెందిన మరో ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై జిల్లా సోమవారం రాత్రి కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తో అవిశ్వాస తీర్మానంపై సమావేశమై చర్చించారు. అవిశ్వాస తీర్మానానికి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సుముఖత చూపడంతో ఇవాళ (మంగళవారం ) జిల్లా కలెక్టర్ ని 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని వినతిపత్రం సమర్పించనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed