తండ్రిని రోకలిబండతో మోది చంపిన కొడుకు..

by Disha web |
తండ్రిని రోకలిబండతో మోది చంపిన కొడుకు..
X

దిశ, చారకొండ 25: కన్న కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురైన ఘటన బుధవారం మండలంలోని జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొడ్లపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మాధవరం కళ్యాణ్ రావ్ తెలిపిన వివరాల ప్రకారం.. దొడ్లపల్లికి చెందిన గొద్దటి అల్లాజీ తరచూ తన కుటుంబసభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో బుధవారం తల్లితో, భార్యతో గొడవ పడుతుంటే తండ్రి గొడ్డటి కిష్టయ్య ఎందుకు గొడవ పడుతున్నావని అడిగితే, ఆగ్రహానికి గురైన గొద్దటి అల్లాజీ తన తండ్రి గొద్దటి కిష్టయ్య (65)ను రోకలిబండతో కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని వెల్దండ సీఐ రామకృష్ణ పరిశీలించి నిందితుడు అల్లాజీని అదుపులోకి తీసుకుని రిమాండ్ పంపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్న కొడుకు గొద్దటి సత్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story