దేవుడి దీపం కింద పడి ఇల్లు దగ్ధం..

by Disha Web Desk 11 |
దేవుడి దీపం కింద పడి ఇల్లు  దగ్ధం..
X

దిశ, మక్తల్: ఇంట్లో దేవుడి వద్ద ఉన్న దీపం ప్రమాదవశాత్తు కిందపడి ఇల్లు దగ్ధమైన సంఘటన మక్తల్ మున్సిపాలి టీలోని ఎల్బీనగర్ కాలనీలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మక్తల్ నివాసి ఆనంద్ ఇంట్లో శనివారం దేవుని పూజ చేసి ఇంటికి తాళం వేసి భార్యభర్తలు వ్యాపారానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు దేవుని దీపం కిందపడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమై పండ్ల పెట్టెలు, 35 వేల నగదు, వంట సమాను, విలువైన డాక్యుమెంట్లు కాలి బూడిదైనాయి.

సమయానికి ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని స్థానికులు అంటున్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి తన సిబ్బందితో వాటర్ ట్యాంకర్ తో నీళ్లు తెప్పించి మంటలు ఆదుపు చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యేను. ప్రభుత్వానికి బాధితులు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed