- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పుడు సర్పంచ్ పదవికి యమ క్రేజ్..సర్పంచ్ పదవి పై యువత ఉత్సాహం
దిశ, రేవల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పోటీల్లో ఉండాలని అటు యువత ఇటు పలు పార్టీల రాజకీయ నాయకులు ఇప్పటినుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా ఈసారి యువత రాజకీయాల్లోకి రావడానికి అదేవిధంగా సర్పంచ్ పదవిపై పోటీ చేసేందుకు ఎక్కువ మక్కువ చెపుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు రూలింగ్ లో ఇది ప్రతిపక్షంలో ఎక్కువగా కనిపిస్తున్నది. యువ లీడర్లే గ్రామాలలో ఇప్పటికే రాజకీయ నాయకులు లోలోపల ప్రచారాలు చేపట్టారు అనే ఊహగణాలు వెల్లువెత్తుతున్నాయి.
దీనికి తోడు గ్రామాలలోని రచ్చబండ అదేవిధంగా చౌరస్తాలలోని ప్రధాన కూడలిలో ఉన్న పెద్ద మనుషులతో ఎం పెద్దయ్య, ఏం పెద్దమ్మ బాగున్నారా ఈసారి సర్పంచ్ కి నిలబడదామని అనుకుంటున్నాను, ఒకసారి కలిసి వెళ్లిపోదామని వచ్చాను, అని మాట ముచ్చట కలుపుతున్నారు. రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎక్కువ సన్నాహాలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలుస్తాం అనే ధీమాతో ఉన్నారు కాదు కాదు ఆరు గ్యారెంటీ ల వల్ల ప్రజలు పూర్తిగా మోసపోయారని ఈసారి బీఆర్ఎస్ పార్టీకె పట్టం కడతారని రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
ఏది ఏమైనా గ్రామాల్లోని కుల సంఘాల నాయకులతో గతంలో రాజకీయ అనుభవాలున్న పెద్ద మనుషులతో మంతనాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు అదేవిధంగా ఈసారి కచ్చితంగా బరిలో ఉంటాను అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. కొందరు నాయకులు గ్రామాలలోని స్థానిక వాట్సప్ గ్రూపులలో ఈసారి మా ఫలానా వ్యక్తి సర్పంచికి గెలుపు పక్క లే లేదు మా ఫలానా వ్యక్తి పక్క అనే విధంగా వాట్సాప్ గ్రూప్ చర్చ వేదికగా మారింది. ఏది ఏమైనా అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా స్థానిక సంస్థల ఎలక్షన్లు కోసం ప్రజలు ఎదురుచూపులు అంతా ఇంతా కాదు ఇది ఇలా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలలో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు కనిపిస్తున్నా కూడా ప్రజల్ని సరిగా పట్టించుకోవడం లేదని ఊహాగానాలు ఉన్నాయి. ఎక్కడ సభలు పెడతారు ఎక్కడ సమావేశాలు చెబుతారు వారికి తెలియదని కొందరు బీజేపీ శ్రేణులు అంటున్నారు. మీరు ఇలా ఉంటే మిగతా కొన్ని పార్టీలు వారు వారి సిద్ధాంతాల కోసం బాగానే పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు వేచి చూడాల్సి ఉంది.
ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు : రేవల్లి మాజీ జడ్పీటీసీ బోర్ల భీమయ్య
ప్రజలలో నమ్మకం లేకనే స్థానిక సంస్థల ఎలక్షన్లు వాయిదా పెట్టారు. అలాగే ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పూర్తి నమ్మకం పోయిందని ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. అదేవిధంగా కుటుంబ సమగ్ర సర్వే పేరుతో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు కావున ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు ఏర్పాటు చేస్తే కచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు అదేవిధంగా స్థానిక ఎలక్షన్లు లేక గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా మర్చిపోయారని ఆయన అన్నారు.
కులగణన పై చర్చలు జరుగుతున్నాయి : బంగారు శ్రీనివాస్, రేవల్లి మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్
కచ్చితంగా జనవరిలో స్థానిక ఎలక్షన్లు ఉంటాయని దీనికి తోడు కులగణన పై చర్చలు జరుగుతున్నాయి. కావున ఎన్ని రోజులు వాయిదా పడాల్సి వచ్చింది అటుపత్పక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎవరు నమ్మదని స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆయన అన్నారు.