అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలి : మంత్రి ఆలంగిర్ ఆలం

by Sumithra |
అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలి : మంత్రి ఆలంగిర్ ఆలం
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టాలని జార్ఖండ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగిర్ ఆలం పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాలతో పాటు విజయ భేరి సభలో ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాల కార్డులను అందించేందుకు గాను ఏఐసీసీ ఆదేశాల మేరకు నారాయణపేట నియోజకవర్గానికి వచ్చామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే నని వారికి మద్దతు ఇస్తున్న యం.ఐ.యం కూడా వారితో కలిసి ఉందన్నారు. అనర్హులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు సంక్షేమ పథకాలను ఇచ్చి అర్హులైన వారికి మొండి చేయి చూపిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ గద్దె నెక్కిన తర్వాత నిరుద్యోగులను మోసం చేశాడన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3500 ఇస్తామని చెప్పి మోసం చేశాడన్నారు. తెలంగాణ ప్రజలు, అమరుల ఆకాంక్ష మేరకు అప్పటి యూపీఏ ప్రభుత్వ చైర్మన్ హోదాలో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు కేవలం కేసీఆర్ కుటుంబంలో కొడుకు, కూతురు, అల్లుడు ముగ్గురు మాత్రమే బాగుపడ్డారన్నారు. కీలకమైన పదకొండు శాఖలను తనవద్దనే పెట్టుకొని నియంతలా పరిపాలన చేస్తున్నాడన్నారు. నియోజకవర్గ ఇంచార్జీ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, వార్డుల్లో ప్రతి ఇంటికి 6గ్యారెంటీ పథకాలు కార్డ్ ను అందచేయాలని బ్లాక్ మండల, పట్టణ అధ్యక్షులకు సూచించారు. టీపీసీసీ కార్యదరి వేణు గౌడ్, జి.సుధాకర్, సదాశివరెడ్డి, ఎండి.గౌస్, విద్యాసాగర్ గౌడ్, నరహరి, బాల్ రెడ్డి, పుర కౌన్సిలర్ ఎండి.సలీం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల.రవీందర్ రెడ్డి, లిఖి రఘుబాబు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed