కృష్ణ నదిలో ఇసుక మాఫియా.. అధికారుల అండదండలతో జోరుగా దందా!

by Dishanational4 |
కృష్ణ నదిలో ఇసుక మాఫియా.. అధికారుల అండదండలతో జోరుగా దందా!
X

దిశ, కృష్ణ: అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడ్డటం లేదు. వాగులు వంకలో కాకుండా ఏకంగా కృష్ణ నది నుంచి రాత్రుళ్లు తేడా లేకుండా ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేసి వేలకు వేలు గడిస్తు సోమ్ము చేసుకుంటున్నారు. నారాయణ పేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని ముడుమాల్, మురహరి దొడ్డి రహదారి పక్కన పరివాహక ప్రాంతం నుండి కృష్ణ నది తీరంలో అక్రమంగా ఇసుకను పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అధికారులతో కుమ్మక్కై ట్రాక్టర్‌కు ధర నిర్ణయించి మామూళ్లు ఇస్తూ అధికారుల కన్ను సైగలో వాళ్ళ అండదండలతో అక్రమంగా ఇసుక తరలిస్తు లక్షలు గడిస్తున్నారు.

కర్ణాటక సరిహద్దుల్లో ఈ మారుమూల ప్రాంతం కావడంతో అటు వైపు వచ్చే అధికారులు, పోలీసుల నిఘా లేకపోవడంతో జోరుగా ఈ దందా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నదిలో నుండి ఇసుక తీసుకుని పగలు కాకుండా అధికారుల కళ్ళు కప్పి రాత్రిలో అక్రమార్కులు ట్రాక్టర్‌ల ద్వారా ఇసుకను అమ్ముకుంటూ ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తూ.. అక్రమార్జన చేస్తూ వారి జేబులు నింపుకుంటున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇలా విచ్చలవిడిగా రాత్రిళ్లు ట్రాక్టర్లతో, రహదారిపై వెళ్లడంతో రహదారులు ఎక్కడ పడితే అక్కడ గుంతల మయంగా మారిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఉన్నత అధికారులు స్పందించి ఇసుకను అరికట్టి ఈ అక్రమంగా కొనసాగిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అనుమతులు ఇవ్వలేదు..

ప్రస్తుతం కృష్ణ నదిలో నుంచి ఇసుక తరలించేందుకు ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తహసిల్దార్ సురేష్ తెలిపారు. కృష్ణ మండలంలో కృష్ణ నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లుగా తమ దృష్టికి వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story