పెంపుడు కుక్కను కొట్టాడని తమ్ముడి పై అన్న దాడి.. ఆపై ఆత్మహత్య

by Mahesh |
పెంపుడు కుక్కను కొట్టాడని తమ్ముడి పై అన్న దాడి.. ఆపై ఆత్మహత్య
X

దిశ, నాగర్ కర్నూల్: తన పెంపుడు కుక్కను కొట్టాడని తమ్ముడిపై అన్న కర్రతో దాడి చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ తమ్ముడి పై దాడి చేసిన అన్న బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగొండ గ్రామానికి చెందిన బీరయ్య, రాజు ఇద్దరు సొంత అన్నదమ్ములు. అదే ఊర్లో ఉన్న తన తండ్రి గారి ఇంటికి బీరయ్య ఆదివారం రాత్రి వెళ్తుండగా తన అన్న రాజు ఇంటి ముందు ఉన్న పెంపుడు కుక్క మొరిగింది. కరుస్తుందేమో అన్న భయంతో పక్కనే ఉన్న రాయితో కుక్కను కొట్టాడు.

నా కుక్కనే కొడతావా..? అని తన తమ్ముడు బీరయ్య పై కర్రతో దాడి చేశాడు అన్న. తమ్ముడు బీరయ్యకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని సోమవారం ఉదయం అన్న రాజు పై బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ కోసమని మంగళవారం రాజుని పోలీస్ స్టేషన్‌కి పిలిచారు పోలీసులు. బుధవారం మళ్లీ రావాలని ఎస్సై చెప్పాడు. దీంతో ఇవాళ తెల్లవారుజామున రాజు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయం పై ఎస్సై వివరణ కోరగా..

పోలీసులకు రాజు ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదు. అన్నదమ్ముల మధ్య చాలా రోజుల నుండి భూమి పంచాయతీ నడుస్తుంది. ఆ కారణంతోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తి పిల్లలకు భూమి రిజిస్ట్రేషన్ చేయాలని కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతుందని తెలిపారు.Next Story

Most Viewed