బడంగ్​పేట్​ కార్పొరేషన్​ వార్షిక బడ్జెట్ రూ.​ 82.78 కోట్లు

by Disha Web Desk 11 |
బడంగ్​పేట్​ కార్పొరేషన్​ వార్షిక బడ్జెట్ రూ.​ 82.78 కోట్లు
X

దిశ, బడంగ్​పేట్​ : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో మంగళవారం వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మేయర్ అధ్యక్షతన జరిగిన ఈ బడ్జెట్ సమావేశంలో అంశాల వారిగా సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపారు. 2024-25 సంవత్సరానికి గానూ 82కోట్ల 78 లక్షల రూపాయలతో వార్షిక బడ్జెట్ ను ఆమోదించడం జరిగింది.

కార్పొరేషన్ పరిధిలో నూతనంగా కాలనీలు, నివాసాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుతుందని అన్నారు. ఎస్ ఎన్ డి పి నిర్మాణాలు అన్ని చోట్ల పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని, రానున్న వర్షాకాలనికి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, డీఈఈ జ్యోతి రెడ్డి, ఏఈఈలు బిక్కు నాయక్, వినీల్ గౌడ్, మేనేజర్ నగేష్ బాబు, ఆర్వో చంద్ర శేఖర్ రెడ్డి, అకౌంటెంట్ వనజ, శానిటేషన్ ఇన్సిపెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Read Disha E-paper

Next Story