ఘనంగా ప్రారంభమైన 8వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్

by Disha Web Desk 12 |
ఘనంగా ప్రారంభమైన 8వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్
X

దిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతమైన లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల క్రీడా ప్రాంగణంలో (బాలుర) భాగంలో 8వ జోనల్ క్రీడలు స్థానిక సర్పంచ్ తిరుపతయ్య, స్థానిక ఎస్సై రవి ఆదివారం జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలలోని 13 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల నుండి సుమారు 1200 మంది క్రీడాకారులు అండర్ -14, అండర్ -17, అండర్-19 స్థాయిల్లో వాలీబాల్ కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ విభాగాలలో నేటి నుండి ఈ నెల 27 వరకు 3 రోజులు 20 క్రీడలు ఆడనున్నాడు.

ఈ సందర్భంగా సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, ఎస్సై రవి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులు చేసిన గౌరవ వందనం పలువురిని ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో స్థానిక గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నా, నాగర్ కర్నూల్ డి సి ఓ దానం, గద్వాల్ డి సి ఓ రఘు, వైస్ ప్రిన్సిపాల్ డి.బాలస్వామి, పిడి. A. వెంకటేశ్వర్లు, రాములు, అకుల్, సుమతి , శ్రీనివాస్, జోషఫ్, శ్రీధర్ రావు, పిడి స్వాములు,13 పాఠశాల పిఇటి లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed