రైతు బంధుతో రైతులలో నూతన ఉత్సాహం..

by Disha Web Desk 20 |
రైతు బంధుతో రైతులలో నూతన ఉత్సాహం..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : రైతు బంధుతో రైతులలో నూతన ఉత్సాహం వచ్చిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. పేటజిల్లా కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి హాజరై జెడ్పీచైర్ పర్సన్ వనజ, కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యేలు ఎస్.ఆర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందుగా అమరవీల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం సాయుధపోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించి ముఖ్య వక్త సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నీటి పారుదల శాఖ ద్వారా మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

రైతులకు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించామని తెలిపారు. అలాగే పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమం వెనుకబడిన తరగతుల శాఖ, పౌరసరఫరాల శాఖ, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అనేక మందికి కంటి చూపు కొరకు కంటి అద్దాలు ఉచితంగా అందజేశామని పేర్కొంటూ పంచాయతీ, శాఖ పురపాలక, రహదారులు భవనాలు, ఇంజనీరింగ్, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, మార్కెటింగ్ శాఖ, పరిశ్రమల శాఖ, చేనేత జోలి శాఖ, ద్వారా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, గ్రంథాలయ చైర్మన్ రామకృష్ణ, మార్కెట్ చైర్ పర్సన్ మోసటి జ్యోతి, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

దశాబ్ది వేడుకలకు కామన్ పబ్లిక్ రాలే..

జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల ప్రారంభం రోజు సామాన్యులు ఎవరూ పెద్దగా హాజరుకాలేదు. కలెక్టరేట్ ఆవరణలో సామాన్య ప్రజలు, ఇతర రంగాల వారి కోసం ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసి కుర్చీలు వేసినా ఎవరు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు ముఖ్యవక్త సందేశానికి ముందు ప్రభుత్వ శాఖల అధికారులను, విద్యార్థులను ఖాళీ కుర్చీలో కూర్చోబెట్టడం గమనార్హం. రాష్ట్ర దశాబ్ది వేడుకల ప్రారంభ రోజే ఈ విధమైన పరిస్థితి ఉంటే దాదాపు 20 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో ఇట్టే అర్థమవుతుంది.

Next Story

Most Viewed