భర్త, భార్య చిత్రహింసలకు రెండవ భార్య అనుమానాస్పద మృతి? కారణం అదేనా

by Disha Web Desk 6 |
భర్త, భార్య చిత్రహింసలకు రెండవ భార్య అనుమానాస్పద మృతి? కారణం అదేనా
X

దిశ, అమరచింత: భార్య, భర్తలు చిత్రహింసలకు గురిచేసి రెండవ భార్య పద్మను (35) హతమార్చినట్లు బాధిత కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని కొంకన్ వాని పల్లె గ్రామానికి చెందిన కుర్వ నారాయణ ఆయన మొదటి భార్య ఇందిరతో వివాహం జరిగి పదేలైన సంతానం కాకపోవడంతో మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింత కుంట మండలానికి చెందిన పద్మను 2009 సంవత్సరంలో సంతానం కోసం వివాహం చేసుకున్నాడు.ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. దీంతో పద్మతో అవసరం తీరింది అనుకున్నారేమో కుర్వనారాయణ,ఆయన మొదటి భార్య మృతిరాలితో తరచూ గొడవ పడేవాడు. పద్మకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమెను చిత్రహింసలు పెట్టేవారు. ఇబ్బందులకు గురిచేసినప్పుడల్లా మృతురాలు సొంత అక్క అయిన సుజాతతో చెప్పుకునేదని తెలుస్తోంది.

ఈ నెల 27న భర్త నారాయణ రెండవ భార్యను కొట్టడం గమనించిన స్థానికులు అక్క సుజాతకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆ మరుసటి రోజున మృతురాలు ఫోన్ పనిచేయలేదన్నారు. అదే రోజు రాత్రి పురుగుల మందు త్రాగిందని, రాత్రి 7 గంటల సమయంలో ఆత్మకూర్ సీ.హెచ్,సీ కేంద్రానికి తీసుకువచ్చినట్లు తెలిసిందన్నారు. పరిస్థితి విషమించడంతో రాత్రి సమయంలో మహబూబ్ నగర్ ఎస్.వీ ఎస్ హాస్పిటల్‌కు తీసుకెళ్లామని ఆమె తెలిపారు. 30వ తేదీన పద్మ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని, అక్కడ ఉన్న ఇంచార్జి విధుల్లో ఏ ఎస్.ఐ. జమీర్ ద్దీన్ ఎస్.ఐ పిటిషన్ తీసుకోవద్దని చెప్పాడని వెనక్కి పంపడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఆమె బ్రతికుండగానే పోలీస్ లు కేసు నమోదు చేసుకుని, ఆమెను విచారించినట్లైతే కారణాలు తెలిసేవని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన తర్వాత కూడా అక్క అమరచింత పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, పిటిషన్ నువ్వు ఇస్తే తీసుకోమని తెలిపినట్లు వాపోయింది. ఆమె చావుకు కారణమైన వారికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని ఉన్నతాధికారులను మృతురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.



Next Story

Most Viewed