మూగ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్

by Disha Web Desk 11 |
మూగ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి  సస్పెన్షన్
X

దిశ, నాగర్ కర్నూల్ :- నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని మూగ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సోషల్ ఉపాధ్యాయుడు మాసయ్యను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ విధుల నుంచి శుక్రవారం సస్పెన్షన్ చేసినట్లు డిఇఓ గోవిందరాజులు తెలిపారు. బిజినపల్లి మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాసయ్య మూగ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా సోషల్ ఉపాధ్యాయుడిని, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్ చేసినట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు.

Next Story