తెలకపల్లి జడ్పీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన సుమిత్ర

by Dishanational4 |
తెలకపల్లి జడ్పీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన సుమిత్ర
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: సుమిత్ర అను నేను.. శాసనము ద్వారా, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉండి.. నా బాధ్యతలను నిర్వహిస్తానని తెల్కపల్లి మండలం జెడ్పీటీసీగా ఎంపికైన ఎన్ సుమిత్ర మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆమె చేత ఎన్నికల అధికారి వై శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన పద్మావతి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమిత్ర పోటీ చేశారు. పద్మావతికి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ముగ్గురు సంతానం ఉన్నారు.

అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హురాలు కాదని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కానీ, అధికార పార్టీ కావడంతో అధికారులు ఆమె నామినేషన్ తిరస్కరించ లేకపోయారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన పద్మావతి 1200 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచి జడ్పీ చైర్మన్ పదవిని కూడా దక్కించుకున్నారు. అయినప్పటికి సుమిత్ర పట్టు విడవకుండా.. కాంగ్రెస్ నాయకుల సహకారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, పద్మావతిని డిస్క్ క్వాలిఫైడ్ చేసేందుకు అవసరమైన ఆధారాలను అన్నింటిని న్యాయస్థానానికి సమర్పించారు. దాంతో పద్మావతి ఎన్నిక చేయలేదంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. జడ్పీ చైర్మన్ పదవితో పాటు, జడ్పీటీసీ పదవిని కూడా కోల్పోయింది.

అయితే రెండో స్థానంలో నిలిచిన సుమిత్రను జడ్పీటీసీగా ప్రకటించాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించడంతో.. ఈ మేరకు మంగళవారం నగర్ కర్నూల్ జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సుమిత్ర జడ్పీటీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో ఉష తదితరులు సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, తాడూరు జడ్పీటీసీ రోహిణి, వంగూరు జడ్పీటీసీ కేవీయన్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సుమిత్రకు అభినందనలు తెలిపారు.


Next Story

Most Viewed