విద్యా వ్యవస్థ పై పర్యవేక్షణ లేకనే ఆత్మహత్యలు : ఎంపీ డీకే అరుణ

by Aamani |
విద్యా వ్యవస్థ పై పర్యవేక్షణ లేకనే ఆత్మహత్యలు : ఎంపీ డీకే అరుణ
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పై నిఘా,పర్యవేక్షణ లేకనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఢిల్లీ నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో రెండు రోజులుగా విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.బుధవారం షాద్ నగర్ లో నీరజ్ అనే విద్యార్థి పాఠశాలపై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం,గురువారం బాలానగర్ గురుకుల పాఠశాలలో విద్యార్ధి ఆరాధ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె జిల్లా ఎస్పీ జానకి తో ఫోన్ లో మాట్లాడి విద్యార్థుల ఆత్మహత్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అసలు ప్రభుత్వ వసతి గృహాల్లో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతూ,విద్యార్థుల మరణాలు ప్రభుత్వానికి పట్టావా అని,ఇది అధికారుల నిర్లక్ష్య వైఖరికి,కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు.విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని,వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement
Next Story