విషాదం.. జూరాల ఎడమ కాలువలో విద్యార్థి మృతి

by Web Desk |
విషాదం.. జూరాల ఎడమ కాలువలో విద్యార్థి మృతి
X

దిశ, అమరచింత: జూరాల ఎడమ కాలువలో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన శుక్రవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. నందిమల్ల గ్రామానికి చెందిన రాజ్ మహ్మద్ కుమారుడు హరిఫ్(10) ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువలో మెట్ల దగ్గర స్నానం చేసేందుకు వెళ్లారు. స్నానం చేస్తుండగా వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ముగ్గురు పిల్లలు కొట్టుకు పోయారు. గమనించిన స్థానికులు గల్లంతైన ముగ్గురిలో ఇద్దరిని మాత్రమే కాపాడగలిగారు. ఎంత వెతికినా హరిఫ్ కనిపించలేదు. కాలువలో ఒక కిలో మీటర్ మేర గ్రామస్తులు గాలించగా, మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నీటి అడుగున శవమై కనిపించాడు. హరిఫ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story