పాల‌యూరు యూనివ‌ర్సిటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది.

పాల‌యూరు యూనివ‌ర్సిటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : పాలమూరు విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలంలోని వెల్జాల్ గ్రామానికి చెందిన టీ. కార్తీక్ (23) అనే విద్యార్థి పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన కోర్సుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును కళాశాలలో సబ్మిట్ చేయడానికి సోమవారం యూనివర్సిటీ కి వచ్చాడు. మంగళవారం ఉదయం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తోటి విద్యార్థులు గుర్తించి అధ్యాపకులకు తెలియజేశారు. వారు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా విద్యార్థి మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న మృతుని కుటుంబ సభ్యులు హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపేందుకు పోలీసులు అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story