ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలు మార్పు జరుగుతుంది : కేటీఆర్

by Disha Web Desk 23 |
ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలు మార్పు జరుగుతుంది : కేటీఆర్
X

దిశ.అచ్చంపేట : బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందానికి కుదుర్చుకున్నాయని అలాగే రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం దేవుళ్ల మీద ఒట్టు ప్రచారానికి తెరలేపిందని, అలాగే ప్రధాని మోడీ ప్రభుత్వం గడచిన పదేళ్లలో అభివృద్ధి శూన్యమని కేవలం మత రాజకీయాలను సృష్టిస్తుందని, ఆలాగే నేడు అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తూ ఉన్న పార్టీలు కావాలా.. లేక ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు కావాలా అచ్చంపేట ప్రజలు ఆలోచించాలని భారాస పార్టీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అచ్చంపేట రోడ్ షో లో ప్రస్తావించారు. ఈ రోడ్ షో లో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల ర్యాలీ లాగా లేదని అప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు విజయోత్సవ ర్యాలీగా కనిపిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బోగస్ కారు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నట్లు మాయ మాటలు చెబుతున్నారని, మార్పు ఎలా ఉంది ?మోటర్లు కాలుతున్నాయా? కరెంట్ సక్రమంగా ఉంటుందా? మంచి నీళ్ల గోస మొదలైందా? ఇవన్నీ నిజమైతే మే 13న జరిగే ఓటింగ్లో కారు గుర్తుకు ఓటు వేసి విద్యావంతుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు.

ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు..

మొన్నటి సాధన సభ ఎన్నికల్లో బాలరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ వచ్చి మోసపోతే గోసపడతారని చెప్పిన వినలేదని కావున పార్లమెంట్ ఎన్నికల్లో బారాస పార్టీ 14 సీట్లు కైవసం చేసుకుంటుందని రాబోయే ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపిస్తే నల్లమల ప్రజల గౌరవాన్ని కాపాడుతాడని తప్పక విజయోత్సవ ర్యాలీ మరోసారి వస్తానని కేటీఆర్ తెలిపారు. ఈ రోడ్ షోలో నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బారాస పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరైనారు.

Next Story