జిల్లా డీఎం అండ్ హెచ్ఓపై విచారణకు ఆదేశం.. మూడు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి..

by Dishafeatures2 |
జిల్లా డీఎం అండ్ హెచ్ఓపై విచారణకు ఆదేశం.. మూడు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లా డీఎం అండ్ హెచ్ఓపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. ఇటీవల రాష్ట్ర కన్స్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప డీఎం అండ్ హెచ్ఓపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గత మార్చి నెలలో కాంట్రాక్టు పద్ధతిన వైద్యుల నియామకంలో పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారని.. తన కూతురు నియామకం విషయంలోనూ లక్ష రూపాయలు లంచంగా తీసుకున్నాడని తిమ్మప్ప డీఎం అండ్ హెచ్ఓపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు.

ఇందుకు సంబంధించి మీడియాలో కథనాలు వచ్చాయి.. తిమ్మప్ప చేసిన ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించిన అధికారులు డీఎం అండ్ హెచ్ఓపై వస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. జాయింట్ డైరెక్టర్ సుధీరాను విచారణ అధికారిగా నియమించి, మూడు రోజుల్లో నివేదికను ఇవ్వాలని రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed