సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్‌పై ప్రత్యేక దృష్టి : వంశీచంద్ రెడ్డి

by Disha Web Desk 23 |
సీఎం రేవంత్ రెడ్డి  మిడ్జిల్‌పై ప్రత్యేక దృష్టి : వంశీచంద్ రెడ్డి
X

దిశ,మిడ్జిల్ : రాజకీయ తొలి అడుగులు వేసిన రోజే ఆదరించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మిడ్జిల్ మండలం పై సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక దృష్టి ఉంటుంది అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. కార్యకర్తలందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుకునేందుకు వీలుంటుందని సూచించారు పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీలు ప్రస్తుతం గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి కార్యకర్తలతో కలవడంతో పలు గ్రామాల నాయకులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ని వంశీచంద్ రెడ్డి ని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మిడ్జిల్ మండలం కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి మిడ్జిల్ మండలంపై ప్రత్యేక ఫోకస్ ఉంటుంది కావున అధిక మెజారిటీ ఇవ్వాలని కోరారు., ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రబ్బాని ఎంపీటీసీలు గౌస్, రాజారెడ్డి నరసింహులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నిఖిల్ రెడ్డి, సాయిలు, వెంకటయ్య బాల్ రెడ్డి పర్వతాలు, ఉస్మాన్, జంగయ్య, వెంకటయ్య, శివ, కృష్ణ జంగయ్య మల్లేష్ ప్రదీప్ రెడ్డి రామ్ గౌడ్ జహంగీర్ వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed