కనీస పెన్షన్ పెంపుకు పార్లమెంటులో మాట్లాడండి

by Naveena |
కనీస పెన్షన్ పెంపుకు పార్లమెంటులో మాట్లాడండి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఆర్టీసీ,ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఈపీఎస్ పెన్షనర్ల కనీస పెన్షన్ పెంపుదలకై పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడాలని ఆర్టీసీ,ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఈపీఎస్ పెన్షనర్ల జాతీయ సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎ.రాజసింహుడు విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో పార్లమెంటు సభ్యురాలు డికె అరుణను కలిసి వినతి పత్రాన్ని సమర్పించి మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు పీఎఫ్ నుంచి వచ్చే కనీస పెన్షన్ 1000 రూపాయలు ఉందని,దాన్ని డిఎ తో 7500 రూపాయలకు పెంచుతూ..పెన్షనర్ల భార్యాభర్తలకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలనే తదితర డిమాండ్లతో అనేక సంవత్సరాలుగా కేంద్రాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు. రెండు సార్లు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి విన్నవించినా..ఆయన సానుకూలంగా స్పందించి ఇంతవరకు అమలు పరచడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఎంపీ డికె అరుణ స్పందించి ఈ పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో భగవంతు,నాగాంజనేయులు,మనోహర్,బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed