- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
దిశ, దామరగిద్ద : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మండలంలోని సమస్యాత్మక (క్రిటికల్) గ్రామాలను వత్తుగుండ్ల, బాపన్ పల్లి, మద్దెల బీడ్, మొదలగు గ్రామాలను సోమవారం జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు సందర్శించి అక్కడ పోలింగ్ బూత్ లను పరిశీలించారు. పోలింగ్ బూత్ల దగ్గర టాయిలెట్స్, ప్రహరీ గోడ, కరెంట్, వాటర్, పోలింగ్ బూత్ కు 200 మీటర్ల దూరం వరకు ముగ్గు వేయించాలని అక్కడ పోలీస్ బందోబస్తు ఎంత ఏర్పాటు చేయాలి. మొదలగు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దామరగిద్ద ఎస్సైకి, ఉపాధ్యాయులకు, గ్రామాధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల రోజు పోలింగ్ కి వచ్చే పోలింగ్ అధికారులకు ఎలాంటి సమస్యలు లేకుండా, ఓటు హక్కు వినియోగించుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, గ్రామ అధికారులకు సూచించారు.
పోలింగ్ బూత్ల దగ్గర ఏలాంటి సమస్యలు ఉన్న ముందస్తు కలెక్టర్ దృష్టిలో ఉంచి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. రాబోయే శాసనసభ ఎన్నికల సమయంలో సమస్యాత్మక గ్రామాల పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే గ్రామము, జిల్లా అభివృద్ధి చెందుతుందని కావున ప్రజలంతా వర్గ బేధాలు లేకుండా శాంతియుతంగా ఒకరితో ఒకరు కలిసి మెలిసి సామరస్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీసీఐ శ్రీకాంత్ రెడ్డి, దామరగిద్ద ఎస్సై శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, అధికారులు మొదలగు వారు పాల్గొన్నారు.