ప్రారంభం కానున్న పాఠశాలలు.. అసంపూర్తి భవనాలు, పూర్తి కాని పనులు

by Aamani |
ప్రారంభం కానున్న పాఠశాలలు.. అసంపూర్తి భవనాలు, పూర్తి కాని పనులు
X

దిశ,కొత్తపల్లి,మద్దూరు : వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. మద్దూరు మండల పరిధిలో 74 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి.అందులో 13 ఉన్నత పాఠశాలలు,9 అప్పర్ ప్రైమరీ పాఠశాలలు,52 ప్రాథమిక పాఠశాలలు నడుస్తున్నాయి.మండలంలో శిధిలావస్థలో ఉన్నటువంటి భవనాలను గుర్తించి నూతన భవనాలు నిర్మించుటకు గత ప్రభుత్వంలో టెండర్లు వేసి నిర్మాణ పనులు ప్రారంభించారు ప్రస్తుతం స్లాబులు వేశారు. కొన్ని తరగతి గదులు సగం వరకు కొనసాగి నిలిచి పోయాయి. పనులు చేస్తున్న గుత్తేదారులకు నేటికీ చిల్లి గవ్వ రాకపోవడం గమనార్హం. తిరిగి ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వంలో మండలం లో అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధికై 48 పాఠశాలలు మంజూరు కాగా 25 నుంచి 30 శాతం వరకు నిధులు మంజూరు కాగా కొన్ని పూర్తి కాగా కొన్ని కొనసాగుతున్నాయి.అసంపూర్తి భవనాలు పూర్తి కాని తరుణంలో నేడు పాఠశాలలు పునఃప్రారంభం కావస్తున్న చదువుకుంటున్న విద్యార్థులకు సరైన వసతులు కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకుని మంచి ఫలితాలు సాధించుటకు దేవాలయంగా భావించే పాఠశాలలు త్వరగా పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story

Most Viewed