- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సొసైటీ ఏర్పాటు చేయాలి
రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సొసైటీ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాలకులు చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ వెనుపోతుల అనిల్ కుమార్ అన్నారు.

దిశ, అచ్చంపేట : రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సొసైటీ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాలకులు చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ వెనుపోతుల అనిల్ కుమార్ అన్నారు. మంగళ వారం పదరా మండలం వంకేశ్వరం గ్రామంలో డాక్టర్ మల్లురవి ఏర్పాటు చేసిన మహానీయుల జ్ఞాన చైతన్య యాత్రలు పదరా మండలం మద్దిమడుగు, ఇప్పలపల్లి, ఉడిమిళ్ళ, చిట్లంకుంట్ల గ్రామాలు తిరిగి వంకేశ్వరం గ్రామానికి బస్సు యాత్ర ద్వారా చేరుకున్నది. ఆనాడు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు అబ్దుల్ కలాం శుక్రవారం సుధాకర్ రెడ్డి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే, సేవాలాల్ మహారాజ్ చేసినటువంటి సంఘసంస్కర్తలు ఏదైతే చెప్పారో వారి ఆలోచనలను ప్రజలకు తెలియజేసే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సొసైటీ ఏర్పాటు చేసి మహిళలు కూడా చైతన్యవంతులు కావాలని గ్రామ గ్రామాన ఈ బృందం పాటల ద్వారా తెలియపరుస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బంగారు మాణిక్యం, గ్రామ సర్పంచ్ బొమ్మనపల్లి మౌనిక తెలంగాణ రాష్ట్ర ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ వెనుపోతుల అనిల్ కుమార్, గ్రామ ఉపసర్పంచ్, యువకులు యువజన సంఘాలు,రేణుక కళాకారుల బృందం,ఈ జ్ఞాన చైతన్య యాత్రకు కోఆర్డినేషన్ గా జి సుధాకర్ సోషల్ సర్వీస్ తాండ్ర రాములు వారి బృందం పాల్గొన్నారు.






