రక్షకులే.. భక్షకులయ్యారు..!

by Nallavelli.Anjaneyulu |

ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధే యధేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

రక్షకులే.. భక్షకులయ్యారు..!
X

దిశ, ఉప్పునుంతల : కంచె చేను మేసినట్టుగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధే యధేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ పదవీని అడ్డు పెట్టుకుని కుటుంబ సభ్యులు దర్జాగా ప్రభుత్వ భూములనే దున్నేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేక్కడో జరిగిన తతంగం కాదండోయ్‌.. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాఖాలో అదికార కాంగ్రెస్ పార్టీ స‌ర్పంచ్ కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచ‌కం. గ్రాస్తులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో గ్రామకంఠం ప్రభుత్వ భూమిలో మంజూరైన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ స్థలంలో అక్రమంగా గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు దున్నడం జరిగిందనీ గ్రామ భూమి సర్వే నెంబర్‌ 147 లో గల 1.10 ఎకరాల్లో గల భూమిని గతంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం రెవెన్యూ అధికారులు కేటాయించారు.

ఇటీవలి కాలంలో గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన సర్పంచ్‌ చీమర్ల లలిత వెంకటేశ్వర్లు, చీమర్ల తిరుపతయ్య, చీమర్ల శ్రీనివాసులు, చీమర్ల యాదయ్యలు కుటుంబ సభ్యులు అక్రమంగా ఆ భూమిని దున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ మంగళవారం మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. గతంలో ఆ భూమిని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం కేటాయిస్తే.. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని అడ్డుకుని ఈ విధంగా చేయడం తగదని గ్రామ ప్రజలు ఖండిస్తున్నారు. గ్రామంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు కోసం గతంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బల్మూర్‌ మండలంలోని గట్టుతుమ్మెన్‌లో ఆయా గ్రామాల్లో మంజూరైన సబ్‌స్టేషన్ల కోసం వర్చువల్‌గా శిలాఫలకం ప్రారంభించారన్నారు. ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టిలో కాంసానిపల్లి గ్రామంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరైనట్లు అధికారికంగా ఉన్నా.. ఇటీవలి కాలంలో ఎన్నికైన గ్రామ సర్పంచు, వారి కుటుంబ సభ్యులు దౌర్జన్యంగా చూడు గోపి ప్రభుత్వ భూమిని దున్నడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

రక్షించే వారే భక్షకులుగా మారితే ఎలాగని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం కేటాయించిన స్థలాన్ని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం సహకరించాలని కోరుతూ మంగళవారం గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ సభ్యుడు కట్ట శేఖర్‌రెడ్డి, కాంసానిపల్లి తండా సర్పంచ్‌ కాట్రావత్‌ వాల్య నాయక్, నాయకుడు కొట్టె శ్రీనివాసులు, మాజీ ఉపసర్పంచ్‌ చింతల నాగరాజు, గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వెల్టూరి రామకృష్ణ, గ్రామ యువ నాయకులు మర్యాద లక్ష్మీ నరసింహారెడ్డి, బయ్య నరేష్, మాచర్ల చంద్రు, ఎల్లయ్య, కాట్రవత్తు లచ్చు, గ్రామ ప్రజలు గజ్జ శైలు, బొల్లు మల్లయ్య, మూడవత్‌ రెడ్యా నాయక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story