- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ అండ్ బీ ఈఈ సంధ్య ఆస్తులపై విచారణ జరిపించాలి : 'నేను సైతం స్వచ్ఛంద సంస్థ' అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ జిల్లా ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంధ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని 'నేను సైతం స్వచ్ఛంద సంస్థ' అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంధ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని 'నేను సైతం స్వచ్ఛంద సంస్థ' అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్ అండ్ బీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ ఆస్తులపై సీబీఐ దాడులను ఆయన స్వాగతిస్తూ, గత 20 ఏండ్లుగా మహబూబ్ నగర్ ఆర్ అండ్ బీ లోనే తీష్ట వేసుకొని పనిచేస్తున్న ఈఈ సంధ్య పై కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్, బైపాస్ రోడ్డు, కళాభారతి తో పాటు ఆమె చేపట్టిన అనేక పనులలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీటిపై ఇప్పటికే తాము జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఫిర్యాదులు చేసినట్లు ఆయన తెలిపారు. వెంటనే ఏసీబీ, విజిలెన్స్ ఇతర సంస్థ లచే సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.






